‘ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితం’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితం’

Oct 23 2026 12:15 AM | Updated on Oct 23 2026 12:15 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు నిరసన తెలపడం గర్హనీయమని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వాన సంక్షేమ పథకాలు పేదలకు అందేలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాజకీయాలకు తావులేకుండా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతోందని పేర్కొన్నారు. పొరబాట్లు జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన కోరారు.

ప్రజా సమస్యల

పరిష్కారానికి కృషి

ఖమ్మం మామిళ్లగూడెం: జిల్లా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన పలువురి నుంచి ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా కమిటీ నాయకులు పలువురు పాల్గొన్నారు.

ఓటు నమోదుపై

విస్తృత ప్రచారం

నేలకొండపల్లి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అర్హులు ఓటు నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీని వాసరావు తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించామని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఎం.కోదండరామ్‌, జిల్లా ఇన్‌చార్జ్‌ జి.శంకర్‌రావు సూచనలతో పాలేరుకు ఎం.శ్రీనివాసరావు, ఖమ్మంకు జంగిపెల్లి రవి, వైరాకు భట్టు రాజేందర్‌నాయక్‌, సత్తుపల్లికి మోరంపూడి అజయ్‌ఘోష్‌, మధిరకు బీరెల్లి వాసును ఇన్‌చార్జ్‌గా నియమించామని తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ వరకు ఓటర్ల నమోదుకు గడువు ఉన్నందున ఇన్‌చార్జ్‌ లు చొరవ తీసుకోవాలని సూచించారు.

సొసైటీలో పొటాష్‌

నిల్వల పరిశీలన

రైతుల ఫిర్యాదుతో ల్యాబ్‌కు నమూనాలు

బోనకల్‌: మండలంలోని బ్రాహ్మణపల్లి సహకార సంఘం తీసుకున్న పొటాష్‌ ఎరువు వినియోగించే సమయాన రెడ్‌ ఆకై ్సడ్‌ మాదిరి చేతులకు రంగు అంటుకుపోతోందని రైతులు పలువురు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సొసైటీలో 78 పొటాష్‌ బస్తాలు ఉండగా, వీటి వినియోగ తేదీ దాటడంతో ఇలా జరిగిందా, లేదా నకిలీ ఎరువులా అన్నది తేల్చేందుకు గురువారం ఏఓ పి.వినయ్‌కుమార్‌ తనిఖీ చేశారు. రైతుల వారీగా ఏ తేదీన ఎరువులు కొనుగోలు చేశారో సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లు ద్వారా తెలుసుకున్నారు. అనంరం నాణ్యతను నిర్ధారించేందుకు శాంపిళ్లను సేకరించగా, ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఏఓ తెలిపారు. నివేదిక వచ్చే వరకు ఎవరికీ అమ్మొద్దని సీఓఈకు సూచించారు. ఆతర్వాత రైతు చెరుకూరి జనార్దన్‌రావు ఎరువు చల్లిన వరి పొలాన్ని కూడా పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement