ప్రజాదివస్‌లో ఫిర్యాదుల స్వీకరించిన సీపీ | - | Sakshi
Sakshi News home page

ప్రజాదివస్‌లో ఫిర్యాదుల స్వీకరించిన సీపీ

Oct 20 2026 1:44 AM | Updated on Oct 20 2026 1:44 AM

ఖమ్మంక్రైం: ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ డే(ప్రజాదివస్‌)లో కమిషనర్‌ సునీల్‌దత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి నుంచి భూవివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక లావాదేవీలు, దంపతుల సమస్యలపై ఫిర్యాదులు అందగా చట్టపరిధిలో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాగా, విజయ దశమి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీపీ.. ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు నిండాలని, పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement