మద్దతు ధరల కోసం 12న ధర్నా | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధరల కోసం 12న ధర్నా

Oct 7 2026 12:47 AM | Updated on Oct 7 2026 12:47 AM

రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

హేమంతరావు

ఖమమమయూరిసెంటర్‌: కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధరల విషయంలో దక్షిణ భారతదేశంపై వివక్ష చూపిందని, ఇక్కడ పండే వరి, పత్తి, మిర్చికి మద్దతు ధర ప్రకటించకపోవడం గర్హనీయమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు అన్నారు. ఎల్‌నినో కారణంగా ఎదురైన పంటల నష్టాన్ని అంచనా వేసి కరువు జిల్లాలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా సమితి సమావేశం మంగళవారం ఖమ్మంలోని గిరిప్రసాద్‌ భవన్‌లో జరగగా బాగం మాట్లాడుతూ.. విద్యుత్‌ కోతలు అరికట్టడం, కరువు జిల్లాల ప్రకటన, పంటల బీమా, మద్దతు ధర అమలుకోసం ఈనెల 12న కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. వరి ఎకరాకు రూ.30వేలు, పత్తి, మిర్చికి రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.20వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీసీఐ కేంద్రాల్లో పత్తిని క్వింటాకు రూ.10వేల చొప్పున కొనుగోలు చేయాలన్నారు. కాగా, సరైన సమయంలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని, ఇకనైనా ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు, నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement