ఖమ్మంమామిళ్లగూడెం/వైరా/ఏన్కూరు: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్‌దత్ మర్యాదపూర్వకంగా కలిశారు. భద్రాచలం వెళ్తున్న కేంద్ర మంత్రి మార్గమధ్యలో ఖమ్మంలోని ఎన్‌ఎస్‌పీ గెస్ట్ హౌస్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్, సీపీ పుష్పగుచ్ఛాలు ఇవ్వగా పలు అంశాలపై మాట్లాడారు. అంతేకాక బీజేపీ నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, వాకదాని పుల్లారావు, గల్లా సత్యనారాయణ, ఈ.వీ.రమేష్, గెంటాల విద్యాసాగర్, వేల్పుల సుధాకర్, అల్లిక అంజయ్య, వెంకటనారాయణ యాదవ్, డీకొండ శ్యామ్, శ్రీనివాసరెడ్డి, ప్రతాప్ తదితరులు కూడా బండి సంజయ్‌ను కలిశారు. అలాగే, వైరాలో కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతేకాక ఏన్కూరులో కూడా ఆగిన కేంద్ర మంత్రి బీజేపీ నాయకులతో కలిసి నిర్మాణంలో ఉన్న రామాలయాన్ని పరిశీలించారు.
వరి సాగు నమోదుకు
రేపటి వరకు గడువు
ఖమ్మంవ్యవసాయం: వరిలో ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాలు చేస్తున్న రైతులు వివరాలను ఆన్‌లైన్ నమోదు చేయించుకునే గడువు గురువారంతో ముగియనుందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్ద ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బిల్లులను చూపిస్తే పోర్టల్‌లో నమోదు చేస్తారని పేర్కొన్నారు. సొంత విత్తనాలు, ఇతర రైతుల నుంచి తీసుకున్న వారైతే ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. గడువులోగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్న రైతులకే సన్నధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ అందుతుందని డీఏఓ ఓ ప్రకటనలో తెలిపారు.


