నేలకొండపల్లి: ఎస్పీడీసీఎల్‌లో గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆరుగురితో లైజన్ ఆఫీసర్ల కమిటీని సీఎండీ ప్రకటించారు. ఇందులో నేలకొండపల్లి మండలం మంగాపురంతండాకు చెందిన ధీరావత్ కోటేశ్వరరావుకు స్థానం దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పాటుపడతానని తెలిపారు.
నవంబర్‌లో రైతు సంఘం జాతీయ మహాసభలు
తల్లాడ: నల్లగొండలో నవంబర్ 17 నుండి 19 వరకు జరిగే రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు కోరారు. ఈ మేరకు తల్లాడలో సంఘం ఆధ్వర్యాన మంగళవారం జరిగిన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, ఎరువుల ఆన్‌లైన్ విధానంతో ఎదురవుతున్న ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వం పంటలకు నీరు విడుదల చేయకపోవడంతో తదితర అంశాలపై సభల్లో చర్చిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, శీలం ఫకీరమ్మ, అయినాల రామలింగేశ్వరరావు, నల్లమోతు మోహన్‌రావు, కళ్యాణపు కృష్ణయ్య, పులికృష్ణయ్య, మన్నేపల్లి రామారా వు, సత్తెనపల్లి నరేష్ పాల్గొన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో
డీఎంహెచ్‌ఓ తనిఖీ
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలోని యలమద్ది ఆస్పత్రిని మంగళవారం డీఎంహెచ్‌ఓ రామారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీ లించడమే కాక చికిత్స పొందుతున్న వారి కేస్ షీట్లు, స్కానింగ్ సెంటర్ రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఆస్పత్రి నిర్వహణపై ఆయన సూచనలు చేశారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే ఇరువర్గాలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. అంతేకాక వైద్యులు, వారి విద్యార్హతలతో బోర్డు ఏర్పాటుచేయడమే కాక వ్యర్థాల సేకరణ సక్రమంగా చేపట్టాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో నిరంతర ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు.
కాలుష్య కారక
సైలెన్సర్ల ధ్వంసం
ఖమ్మం క్రైం: శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూ ప్రజ లకు ఇబ్బంది కలిగిస్తున్న బుల్లెట్ వాహనాల సైలెన్సర్ల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ డీసీపీ రామానుజం తెలిపా రు. ఈమేరకు నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన 400కు పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించగా, వాటిని మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈసందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ వాహనదారులు కంపెనీ సమకూర్చిన సైలెన్సర్లను వినియోగించాలే తప్ప మార్పు చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని హెచ్చరించారు. గతంలోనూ 1,654 సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేశామనితెలిపారు. ఏసీపీలు శ్రీనివాసులు, సుశీల్‌సింగ్, సీఐలు సత్యనారాయణ, అప్పలనాయుడు పాల్గొన్నారు.
బీఎల్‌ఏలు
అప్రమత్తంగా ఉండాలి
ఖమ్మంమయూరిసెంటర్: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో పార్టీ బూత్ లెవల్ సూపర్‌వైజర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్‌ఏలు) అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,36,787 మందికి నోటీసులు అందగా, 17,555 మంది విచారణ పూర్తయిందని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లను బీఎల్‌ఏలు కలిసి, ధ్రువీకరణ పత్రాలు అధికారులకు అందించేలా అవగాహన కల్పించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.


