చింతకాని: మండలంలోని నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆంగ్ల అధ్యాపకుడిని తొలగించాలని విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టగా జిల్లా ఇంటర్ విద్యాఽధికారి రవిబాబు మంగళవారం విచారణ నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడడమే కాక అధ్యాపకులతో కూడా చర్చించారు. తరగతులు సక్రమంగా చెప్పకుండా విద్యార్థులను దూషిస్తున్న ఆంగ్ల అధ్యాపకుడి అంశాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తామని, అంతేకాక తాత్కాలిక విధానంలో అధ్యాపకుడిని నియమిస్తామని తెలిపారు. కాగా, విద్యార్థులు ధర్నా చేయడంపై గ్రామస్తులు కళాశాల వద్దకు వచ్చి డీఐఈఓ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేయడంతో పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ప్రిన్సిపాల్ నవీన్‌కుమార్, ఎస్సై నరేష్, అధ్యాపకులు పాల్గొన్నారు.


