నేలకొండపల్లి: పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా నాలుగు విభాగాల్లో పనులు చేపట్టేందుకు జిల్లాలోని 20 గ్రామాలను పైలట్‌గా ఎంపిక చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.వినోద్‌కుమార్ వెల్ల డించారు. నేలకొండపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేసిన ఆయన రికార్డుల పరిశీలన అనంతరం సర్పంచ్, పాలకవర్గంతో చర్చించారు. ఆతర్వాత డీపీఓ విలేకరులతో మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణను నాలుగు విభాగాలుగా విభజించినట్లు తెలిపారు. ఇందులో తడి, పొడి చెత్త తో పాటు ప్రమాదకర చెత్త, శానిటేషన్ చెత్తగా విభజించగా.. ఎంపిక చేసిన 20గ్రామాల్లో త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. అక్కడ విజయవంతమయ్యాక అన్ని గ్రామాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. అలాగే, జిల్లాలో పంచాయతీ కార్మికులకు ప్రోత్సాహకాలు అందించేలా ‘నమస్తే’ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో 2,500 మందికి లబ్ధి జరుగుతుందని వివరించారు. మండల పంచాయతీ అధికారి ఎం.శ్రీనివాసరావు, సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ మహేష్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు.
రికార్డుల పరిశీలన
ముదిగొండ: మండలంలోని సువర్ణాపురం, న్యూలక్ష్మీపురం గ్రామపంచాయతీ కార్యాలయాలను డీపీఓ వినోద్‌కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఈసంర్భంగా రికార్డులను పరిశీలించాక పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి పన్నుల వసూళ్లపై పాలకవర్గం, ఉద్యోగులకు సూచనలు చేశారు. ఎంపీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పోలంపల్లిలో విచారణ
కారేపల్లి: అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తూ, బిల్లులు చేయకుండా ఎంపీఓ వేధిస్తున్నాడని కారేపల్లి మండలం పోలంపల్లి సర్పంచ్ ధరావత్ హేమలత ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డీపీఓ వినోద్‌కుమార్, డీఎల్‌పీఓలు రాంబాబు, విజయకుమారి భాగ్యనగర్, పోలంపల్లి గ్రామపంచాయతీల్లో పర్యటించారు. అనంతరం సింగరేణి ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం కాగా, అభివృద్ధి పనులకు తీర్మానాలను అడ్డుకోవడంతో పాటు ఎంబీలైనా ఎంపీఓ బిల్లులు చేయనివ్వడం లేదని సర్పంచ్ హేమలత వివరించారు. ఈమేరకు డీపీఓ రికార్డులు పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీఓ, ఏఈలతో పాటు పాలక వర్గాలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అత్యవసర పనులకు సర్పంచ్, కార్యదర్శులు నోటిఫై ద్వారా బిల్లులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపీడీఓ బి.పద్మ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి వినోద్‌కుమార్


