● ఎనిమిదేసి వస్తువులతో పంపిణీ ● మొదలైన ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రప్రభుత్వం ప్రైవేట్ కాన్వెంట్లకు దీటుగా చిన్నారులకు బోధన అందించేందుకు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విభాగాన్ని ప్రవేశపెడుతోంది. జిల్లాలో గతేడాది 30 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్ ప్రారంభించగా... ఈ ఏడాది మరో 114 పాఠశాలలకు మంజూరు చేశారు. కాగా, గతేడాది ప్రీ ప్రైమరీ తరగతులు మొదలైన పాఠశాలల్లో విద్యార్థులకు కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
కిట్‌లో సామగ్రి ఇవే...
ప్రీ ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకు ఇస్తున్న కిట్లలో పలు రకాల సామగ్రి ఉన్నాయి. విద్యార్థులకు షూ, బెల్ట్, సాక్స్, యూనిఫామ్, పలక, డ్రాయింగ్ బుక్‌తో పాటు కలర్ క్రేయాన్లు, పెన్సిళ్లు తదితర వస్తువులు ఉన్నాయి. ఆటపాటలతో కూడిన విద్య అందించే ఉద్దేశంతో ఈ విభాగంలో బోధన జరగనుంది. కాగా, ఈ విద్యా సంవత్సరం కొత్తగా మంజూరైన 114 పాఠశాలల విద్యార్థులకు త్వరలో కిట్లు అందనున్నాయి. ఇక బోధనకు సైతం ఇన్‌స్ట్రక్టర్ల ఎంపిక పూర్తికాగా, వీరికి నియామక పత్రాలు అందజేస్తున్నారు. వీరి ద్వారా సోమవారం నుంచి బోధన మొదలుకానుందని విద్యాశాఖ ఏఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.


