న్యూస్‌రీల్
వృత్తి నైపుణ్య కోర్సులతో ఉపాధి
అండగా నిలుస్తున్న సెట్‌కామ్..
యువజన, క్రీడల శాఖ
ఆరేళ్లలో 2వేల మందికి శిక్షణ
మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
కష్టకాలంలో గోదారమ్మ!
వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన.. గోదావరి జలాలు చేరడంతో వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026
మహిళలకు ఉపాధి మార్గాన్ని చూపేందుకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఇస్తున్న శిక్షణకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతీ బ్యాచ్‌కు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆదరణ దృష్ట్యా జిల్లాలో మరిన్ని శిక్షణ కేంద్రాల
ఏర్పాటుకు ఆలోచనలు చేస్తున్నాం.
– తుంబూరు సునీల్‌రెడ్డి, డీవైఎస్‌ఓ
టైలరింగ్ రంగానికి ఉన్న ఆదరణ దృష్ట్యా శిక్షణ తీసుకుంటున్నా. శిక్షణ పూర్తయ్యాక ఇంటివద్దే టైలరింగ్ షాపు ఏర్పాటుచేయాలనే ఆలోచన ఉంది. ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వపరంగా రుణాలు, ఇతర ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటా.
– జి.దివ్యశ్రీ, బూడిదంపాడు
ఖమ్మం రాపర్తినగర్: ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో భర్త మాత్రమే ఉద్యోగం చేస్తే కుటుంబాన్ని పోషించడం కష్టమవుతోంది. ఇంకొందరు మహిళలు బయటకు వచ్చి పనిచేసేందుకు పరిస్థితులు సహకరించడం లేదు. ఇలాంటి వారు ఇంటి వద్దే ఉపాధి పొందేలా సెట్‌కామ్, యువజన, క్రీడల శాఖ అండగా నిలుస్తోంది. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటుచేసిన కేంద్రం ద్వారా మహిళలకు వత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇప్పించి నిష్ణాతులను తీర్చిదిద్దడమే కాక ఉపాధి కల్పించేలా అడుగులు పడుతున్నాయి. 2019లో ఏర్పాటైన ఈ కేంద్రం వద్ద ఇప్పటివరకు 2వేల మంది శిక్షణ పూర్తిచేసుకోగా.. ఇందులో చాలామంది ఎంచుకున్న రంగంలో స్వయం ఉపాధితో ఆర్థిక స్థిరత్వం సాధించడం విశేషం.
మూడు కోర్సుల్లో శిక్షణ
సర్దార్ పటేల్ స్టేడియంలో శిక్షణ కేంద్రాన్ని ఏడేళ్ల క్రితం ప్రారంభించారు. ఇక్కడ సెట్‌కామ్, యువజన, క్రీడల శాఖ ద్వారా పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా బ్యూటీషిషన్, కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల యువకులు, మహిళలు ఈ శిక్షణకు బారులు దీరుతున్నారు. దీంతో కేంద్రం ద్వారా ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా శిక్షణ పూర్తి చేసుకోగా పలువురు ఆయా రంగాల్లో స్థిరపడి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు మూడు కోర్సుల్లో రెండేసి బ్యాచ్‌లకు శిక్షణ పూర్తికావడం యువతుల నుంచి వస్తున్న ఆదరణకు అద్దం పడుతోంది. ఈ కేంద్రంలో నిపుణులైన ట్రెయినర్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తూ నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారు. శిక్షణకు వస్తున్న సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోనూ కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


