ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వీడీవోస్‌కాలనీ ప్రాంతంలో వీధి కుక్కల మృతిపై జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం 54వ డివిజన్ పరిధిలోని ఓ చోట కుక్కలకు శనివారం ఉదయం కొందరు ఆహారం పెట్టేందుకు వచ్చేసరికి రెండు మృతి చెందాయని గుర్తించారు. అదే ప్రాంతంలో పరిశీలిస్తుండగా మొత్తం 14 కుక్కల మృతదేహాలు బయటపడ్డాయి. అంతేకాక కొన్నింటి మృతదేహాలకు ఇంజక్షన్ నీడిళ్లు ఉండడంతో విషప్రయోగం జరిగిందనే అనుమానంతో టి.వినీల్, విక్రమ్ తదితరులు ఖమ్మం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకేసారి ఇన్ని కుక్కలు చనిపోవడంపై అనుమానాలు ఉన్నందున కారణాలు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత స్థానికుల ఫిర్యాదుతో చనిపోయిన కుక్కలను కార్పొరేషన్ సిబ్బంది ట్రాక్టర్‌లో తరలించారు.
విషప్రయోగం అనుమానంతో
పోలీసులకు ఫిర్యాదు


