కట్టుకాచారం పీఎస్‌లో ‘విద్యా ప్రవేశ్‌’ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కట్టుకాచారం పీఎస్‌లో ‘విద్యా ప్రవేశ్‌’ ప్రారంభం

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

నేలకొండపల్లి: పిల్లల్లో పాఠశాలలపై భయం పోగొట్టి, ఆటపాటలతో బోధించేందుకు ప్రవేశపెట్టిన ‘విద్యా ప్రవేశ్‌’ కార్యక్రమాన్ని నేలకొండపల్లి మండలం కట్టుకాచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ బి.చలపతిరావు ప్రారంభించి మాట్లాడుతూ భయం పోగొట్టి ప్లిలను బడికి అలవాటు చేసేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమం 12వారాల పాటు కొనసాగుతుందని తెలిపారు. పిల్లల శారీరక, మానసిక వికాసం, సామాజిక భావోద్వేగం, ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని వెల్లడించారు. పుస్తకాల్లోని పాఠాలు కా కుండా మూడు నెలల పాటు ఇండోర్‌, ఔట్‌డోర్‌ ఆటలు, బొమ్మలు గీయడం, మట్టితో వస్తువులు తయారు చేయించడంతో పాటు కథల ద్వారా బోధ న సాగుతుందని తెలిపారు. కాగా, విద్యాప్రవేశ్‌ కార్యక్రమ అమలుకు అవసరమైన సామగ్రి సమకూర్చిన ఉపాధ్యాయుడు ఇటిక్యాల సురేష్‌ను అభినందించారు. ప్రధానోపాధ్యాయులు నరేందర్‌, రాందాసు, ఉపాధ్యాయులు కళ్యాణి, నారాయణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement