వేంసూరు: ఒకటికి నాలుగు రెట్ల డబ్బు ఇస్తామని పలువురిని మోసగిస్తూ దోపిడీకి పాల్పడుతున్న ముటాలో మరో ముగ్గురిని పోలీసులు శనివారం అరెస్టు చేయగా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో గతనెల 30న వేంసూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈమేరకు సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగం నేతృత్వాన ప్రత్యేక బృందాలు దర్యాప్టు చేపట్టగా ఇప్పటికే చంటిబాబు, కానిస్టేబు ల్ వర్ధన్‌ను తదితరులను ఈనెల 2న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఏసీపీ తెలిపారు. కాగా, శనివారం మధ్యాహ్న వేంసూరు– లంకపల్లి రోడ్డులో మామిడి తోటలో తలదాచుకున్న నిందితులు వాడపల్లి విజయ్, గుమ్మళ్ల సుమంత్, కొంగల వంశీని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈసమావేశంలో ఎస్‌ఐ టి.కవిత, సిబ్బంది పాల్గొన్నారు.


