మాజీ ఎమ్మెల్యే లింగయ్యదొరకు గౌరవ డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే లింగయ్యదొరకు గౌరవ డాక్టరేట్‌

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

కరకగూడెం: మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌, ఆదివాసీ హక్కుల జాతీయ నాయకుడు చందా లింగయ్యదొరకు అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక యునైటెడ్‌ అమెరికన్‌ యూనివర్సిటీ ఫర్‌ లీడర్‌షిప్‌, ఎక్స్‌లెన్స్‌ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. సామాజిక సేవ, నాయకత్వ రంగాల్లో ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ డాక్టర్‌ ఆఫ్‌ సోషల్‌ సర్వీస్‌, లీడర్‌షిప్‌ గౌరవ డాక్టరేట్‌ను శనివారం పుదుచ్చేరిలో నిర్వహించిన యూనివర్సిటీ కాన్వొకేషన్‌ కార్యక్రమంలో అందజేశారు. గిరిజన, ఆదివాసీ, బహుజన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం అనేక దశాబ్దాలుగా నిరంతరంగాపోరాడుతున్న చందా లింగయ్యదొర ప్రజా జీవితంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమం, విద్యా అవకాశాల విస్తరణ, సామాజిక న్యాయం కోసం కృషి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement