సూపర్‌బజార్(కొత్తగూడెం): న్యాయవాదులు ఆరోగ్యం కాపాడుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. తొలుత న్యాయమూర్తికి డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్ జస్టిస్‌కు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రథమ చికిత్స కేంద్రం సిబ్బందికి అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం న్యాయవాదుల మీటింగ్ హాల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఫ్యామిలీ కోర్టు, ఎకై ్సజ్ కోర్టు, లేబర్ కోర్టుల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దమ్మపేట, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు నుంచి హాజరైన న్యాయవాదుల సంఘ కార్యవర్గ సభ్యులు వినతి పత్రాలు అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.ప్రేమలత, న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరావు


