166 కేజీల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

166 కేజీల గంజాయి స్వాధీనం

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

సత్తుపల్లిటౌన్‌: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న 166.300 కేజీల గంజాయిని సత్తుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పట్టణ సీఐ శ్రీహరి శనివారం వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా దొరగుడాలోని గుంతవాడకు చెందిన ప్రబిన్‌భాత్ర కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు రూ.89.13 లక్షల విలువైన గంజాయి అప్పగించిన బికారి అలియాస్‌ రోహన్‌ హైదరాబాద్‌లో తాను చెప్పిన వ్యక్తికి అందించాలని రూ.10 వేల కిరాయి ఖరారు చేశాడు. దీంతో ప్రబిన్‌ కారులో దారకొండ జంక్షన్‌ నుంచి బయలుదేరి రాజమండ్రికి, ఆపై గ్రీన్‌ఫీల్డ్‌ హైవే మీదుగా వస్తూ శుక్రవారం సత్తుపల్లి చేరుకున్నాడు. ఇక్కడ భోజనం చేశాక హైదరాబాద్‌ వెళ్లాలని భావించి ఆగాడు. ఈ మేరకు పక్కా సమాచారంతో ఏసీపీ వసుంధరయాదవ్‌ సూచనల మేరకు ఈగల్‌ టీం, సత్తుపల్లి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా కారులో గంజాయి లభించింది. దీంతో గంజాయి, కారును సీజ్‌ చేసి ప్రబిన్‌ను శనివారం కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీహరి తెలిపారు. తనిఖీల్లో ఎస్‌ఐలు వీరప్రసాద్‌, ప్రదీప్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఒకరి అరెస్టు.. కారు సీజ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement