బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.లక్ష మాయం | - | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.లక్ష మాయం

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

ఖమ్మంక్రైం: ఓ ప్రైవేట్‌ ఉద్యోగి బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.లక్ష మాయమైన ఘటనపై శనివారం ఖమ్మం టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మామిళ్లగూడెంకు చెందిన సదరు వ్యక్తి ఖాతా నుంచి రూ.1.05 లక్షలు డ్రా అయినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆయన బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకోగా సైబర్‌ నిందితుల పనేనని భావిస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

చేపల వేటకు వెళ్లిన

వ్యక్తి మృతి

రఘునాథపాలెం: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సాగర్‌ ప్రధాన కాల్వలో పడి మృతి చెందాడు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంకు చెందిన కొత్తపల్లి పృథ్వీ (35) చేపలు పట్టేందుకు శుక్రవారం సాగర్‌ ప్రధాన కాల్వ డీప్‌కట్‌ వద్దకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తుండగా కాల్వ గట్టుపై దుస్తులు, చెప్పులు కనిపించాయి. దీంతో స్థానికుల సాయంతో గాలించగా శనివారం మృతదేహం బయటపడింది. ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి కాల్వలో పడగా, లోతు ఎక్కువగా ఉండడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఘటనపై పృథ్వీ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement