సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి జేవీఆర్ ఓసీకి రూ.22.69 లక్షల విలువైన 12 టన్నుల సామర్ధ్యం గల ఎస్కార్ట్ క్రేన్ సమకూరింది. ఈ క్రేన్‌ను శుక్రవారం ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ క్రేన్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వాహనాల తరలింపు, ఇతర పనులు సులవవుతాయని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు ప్రహ్లాద్, బొల్లం శ్రీనివాస్, కె.సోమశేఖర్‌రావు, డి.శ్రీని వాసరావు, బి.రాజేశ్వరరావు, జి.కల్యాణ్‌రామ్, గోవింద్, ముక్కా శ్రీను, పి.గోపి, జగదీష్, నాయకులు ఎస్.సుధాకర్, బి.కోటేశ్వరరావు, కావ్య, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.


