ప్రీ ప్రైమరీ స్కూళ్ల ప్రారంభానికి సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రీ ప్రైమరీ స్కూళ్ల ప్రారంభానికి సిద్ధం కావాలి

Jul 4 2026 12:26 AM | Updated on Jul 4 2026 12:26 AM

ఎర్రుపాలెం: జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రీప్రైమరీ స్కూళ్లు ప్రారంభించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని జిల్లా విద్యాశాఖాధికారి సదానందం సూచించారు. ఎర్రుపాలెం మండలం రాజుల దేవరపాడు, చొప్పకట్లపాలెంలోని ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ పాఠశాలల నిర్వహణ ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, సామగ్రిని పరిశీలించాక విద్యార్థుల నమోదుపై ఆరా తీశారు. అలాగే, చొప్పకట్లపాలెం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించగా.. నాణ్యత లేకపోడంపై ఏజెన్సీ బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఓ బి.మురళీమోహన్‌రావు, హెచ్‌ఎంలు నండ్రు వెంకటేశ్వరరావు, మారపాక బాబూరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవలు ఉపయోగించుకోండి

ఖమ్మంరూరల్‌: వరదలు, ఇతర విపత్తుల సమయాన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవలను వినియోగించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి జి.సదానందం తెలిపారు. మండలంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ మహిళా కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరదలు, అగ్నిప్రమాదాల సమయాన వ్యవహరించాల్సిన తీరు, బాధితులను కాపాడడంపై ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మాక్‌ డ్రిల్‌ ద్వారా విద్యార్థులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కేడెట్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఈఓ మాట్లాడగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గోపాల్‌ పలు శాఖల అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఉద్యోగులు పెసర ప్రభాకర్‌రెడ్డి, చావా శ్రీనివాసరావు, వినయేందర్‌రెడ్డి, బీటెన్‌ సింగ్‌, సందీప్‌కుమార్‌, అజయ్‌శర్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.

డీఈఓ సదానందం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement