ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ నెల 5వ తేదీన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలస్థాయి అండర్–14, 16 క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సీహెచ్ వెంకట్, కోఆర్డినేటర్ ఎండీ మసూధ్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రికెటర్లు వయస్సు ధ్రువీకరణపత్రం, ఆధార్‌కార్డుతో ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఇక్కడ ఎంపిక చేసే జట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. వివరాలకు ఎండీ ఫారుఖ్‌ను 79818 81095 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
జెడ్పీహెచ్‌ఎస్‌లో
ఆర్‌జేడీ పరిశీలన
ఏన్కూరు: ఏన్కూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వరంగల్ ఆర్‌జేడీ మదన్‌మోహన్ శుక్రవారం పరిశీలించారు. ఇక్కడ తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఉన్న వసతులు, భవనాల లభ్యతపై ఆరా తీశారు. తరగతి గదులు, విద్యుత్, తాగునీటి సౌకర్యంపై వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈఓ వాసవీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


