ఇసుక తరలిస్తుండగా లారీలు సీజ్
వైరా: ఆంధ్రప్రదేశ్ నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు లారీలతో పాటు ఎస్కార్ట్‌గా వస్తున్న కారును వైరా పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వైరా మండలం సోమవరం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమాన నల్లగొండ జిల్లాకు చెందిన ఇస్లావత్ భిక్షు, ముక్కుమాల యాదయ్య, దామ సైదులు, వాంకుడోత్ లింగానాయక్ మూడు లారీల్లో ఇసుక తరలిస్తూ పట్టుబడ్డారు. అంతేకాక ఎస్కార్ట్‌గా వచ్చిన కారు, అందులో మార్చేందుకు సిద్ధం చేసిన నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నలుగురిని రిమాండ్‌కు తరలించగా, బచ్చుబోయిన యాదయ్య పరారీలో ఉన్నారని ఎస్‌ఐ రామారావు తెలిపారు. తనిఖీల్లో పోలీసు సిబ్బంది పవన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


