● కేటీఆర్, హరీష్, ఆర్‌ఎస్ అరెస్ట్ అక్రమం ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రా.. చూసుకుందాం అంటూ సవాళ్లు విసురుతున్న మంత్రులు పాలనను గాలికొదిలేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని శుక్రవారం ఆయన పరిశీలించాక విలేకరులతో మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరి ఓటు కాపాడడమే ధ్యేయంగా బీఆర్‌ఎస్ శ్రేణులు కృషి చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర అప్పులపై బీఆర్‌ఎస్ భవన్‌లో చర్చకు సిద్ధమన్న మంత్రి జూపల్లి కృష్ణారావు తీరా సమయానికి గాంధీభవన్‌కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సవాల్ విసిరిన మంత్రి కోసం కేటీఆర్ వేచి ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని కేటీఆర్, హరీష్‌రావు, ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను గృహనిర్బంధం చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న కాలంలో మరిన్ని సెల్ఫ్‌గోల్స్ వేసుకోవడం ఖాయమని తెలిపారు.
ఖమ్మంలో చీకటి పాలన
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని పువ్వాడ విమర్శించారు. నగరంలో రోడ్లు అధ్వానంగా మారగా, శానిటేషన్ లోపించి, వీధిదీపాలు వెలగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఖమ్మంలో ప్రస్తుతం చీకటిపాలన సాగుతోందన్నారు. ‘సర్’లో భాగంగా రెండు, మూడు చోట్ల ఓట్లు ఉన్న వారు నిబంధనల ప్రకారం ఒకే చోట ఓటు ఉంచుకోవాలని సూచించారు. మ్యాపింగ్ కాని ఓట్ల విషయంలో సాంకేతిక ఇబ్బందులను ఈఆర్‌ఓ, ఆర్‌ఓల దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. కాగా, ప్రతీ పోలింగ్ బూత్‌లో బీఆర్‌ఎస్ తరుపున బీఎల్‌ఏలను నియమించామని తెలిపారు. ఆయన వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం, నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, శీలం శెట్టివీరభద్రం, తోట రామారావు, బత్తుల మురళి, కర్నాటి కృష్ణ, మక్బూల్, బచ్చు విజయ్‌కుమార్, నాగండ్ల కోటి, కూరాకుల వలరాజు, దేవబత్తిని కిషోర్, షేక్ షకీనా, ఆరెంపుల వీరభద్రం ఉన్నారు.
బీఎల్‌ఓకు ఎన్యుమరేషన్ ఫారం
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారంలో వివరాలు నింపిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఉద్యోగులకు అందజేశారు. ఆయన శుక్రవారం తన నివాసంలో ఫారంను నింపి కేఎంసీ ఏఎంసీ అనిల్‌కుమార్, ఆర్‌ఓ ఏ.సుధాకర్ సమక్షాన బీఎల్‌ఓ షాహీన్ కమల్‌కు అందజేయగా, ఓటర్లు తప్పనిసరిగా ఫారాలు నింపాలని సూచించారు.


