ఓట్లు తొలగించే కుట్రలను అడ్డుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఓట్లు తొలగించే కుట్రలను అడ్డుకోవాలి

Jul 3 2026 12:17 AM | Updated on Jul 3 2026 12:17 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) పేరుతో తొలగించే కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఐక్యంగా అడ్డుకోవాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యాన గురువారం ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, దండి సురేశ్‌, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌, మాస్‌లైన్‌ జిల్లా నాయకుడు ఆవుల అశోక్‌ మాట్లాడారు. బీజేపీ స్వార్థంతో వ్యవహరిస్తూ అర్హుల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఓటరు జాబితా సవరణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇదే సమయాన బీఎల్‌ఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ ర్యాలీలో పలు పార్టీల నాయకులు నాగండ్ల దీపక్‌చౌదరి, వై.విక్రమ్‌, జి.రామయ్య, షేక్‌ జానీమియా, కమర్తపు మురళి, దొబ్బల సౌజన్య, జితేందర్‌రెడ్డి, యర్రా శ్రీనివాసరావు, ఎస్‌.నవీన్‌రెడ్డి, సీవై పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యాన భారీ ప్రదర్శన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement