‘ప్రభుత్వాల వైఫల్యాలతోనే యువత నిర్వీర్యం’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వాల వైఫల్యాలతోనే యువత నిర్వీర్యం’

Jul 3 2026 12:17 AM | Updated on Jul 3 2026 12:17 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు సరిపడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యాయని, ఫలితంగా యువత పక్కదారి పట్టి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని పీవైఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌వీ రాకేశ్‌, జిల్లా కార్యదర్శి జక్కుల భరత్‌ పేర్కొన్నారు. ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పీవైఎల్‌ జిల్లా అధ్యక్షుడు జాటోత్‌ ప్రేమ్‌సింగ్‌ అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులను వంచించగా, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే తరహాలో వ్యవహరించిందని విమర్శించారు. ఫలితంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత మానసిక క్షోభతో పక్కదారి పడుతున్నారని తెలిపారు. ఇకనైనా ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయడంతో పాటు కొత్త పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు. అలాగే మత్తు పదార్థాల అమ్మకాలను అరికట్టాలని కోరారు. సమావేశంలో పీవైఎల్‌ నాయకులు సీహెచ్‌ ధరణికృష్ణ, మామిడాల వెంకటేశ్‌, తోట రమేశ్‌, మక్కా రవీందర్‌, ఇస్లావత్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement