కళలు, సంస్కృతిపై న్యూఢిల్లీలో శిక్షణ | - | Sakshi
Sakshi News home page

కళలు, సంస్కృతిపై న్యూఢిల్లీలో శిక్షణ

Jul 3 2026 12:17 AM | Updated on Jul 3 2026 12:17 AM

కల్లూరురూరల్‌: న్యూఢిల్లీలో 21 రోజుల పాటు జాతీయస్థాయిలో నిర్వహించిన ఓరియంటేషన్‌ కోర్సులో కల్లూరు మండలం చెన్నూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఇంగ్లిష్‌ ఉపాధ్యాయురాలు దిగుమర్తి శిరీష పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మరికొందరు ఉపాధ్యాయులు పాల్గొనగా, జిల్లా నుంచే శిరీష ఒకరే ఎంపికయ్యారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం, విలువలు, సంగీతం, జానపద గీతాలు, చిత్రలేఖనం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆమె మాస్టర్‌ ట్రెయినీగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఉపాధ్యాయులు పాల్గొనగా, జిల్లా నుంచి తాను హాజరయ్యానని తెలిపారు. ఇక్కడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఢిల్లీ శిక్షణలో నేర్చుకున్న అంశాలపై తర్ఫీదు ఇవ్వనున్ననట్లు వెల్లడించారు.

జిల్లా నుంచి ఒకే ఉపాధ్యాయురాలికి

అవకాశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement