సత్తుపల్లిటౌన్/తల్లాడ: సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్‌కు సందర్శకులు పెరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అటవీ శాఖఅధికారి అనూజ్ అగర్వాల్ ఆదేశించారు. పార్క్‌ను గురువారం పరిశీలించిన ఆయన వాచ్ టవర్, లైబ్రరీ వివరాలు తెలుసుకున్నారు. పార్క్ ఆహ్లాదకరంగా ఉన్నందున ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. తొలుత తల్లాడలో రూ.19.75లక్షలతో నిర్మిస్తున్న పులిగుండాల ఎకో టూరిజం రిసెప్షన్ సెంటర్ పనులను కూడా డీఎఫ్‌ఓ అనూజ్ పరిశీలించారు. రేంజర్ సీహెచ్. ఎల్లయ్య, డీఆర్‌ఓ సుజన్‌కుమార్, ఉద్యోగులు ఉమ, కోటేశ్వరరావు, కృష్ణ పాల్గొన్నారు.
జిల్లా అటవీ శాఖాధికారి అనూజ్ అగర్వాల్


