చిరుత సంచరిస్తోందని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

చిరుత సంచరిస్తోందని ఆందోళన

Jul 3 2026 12:17 AM | Updated on Jul 3 2026 12:17 AM

ఏన్కూరు/జూలూరుపాడు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అంకినాపురంతండా–భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్‌ అటవీ బీట్‌లో చిరుత సంచరిస్తోందని గురువారం ప్రచా రం జరిగింది. ఏన్కూరు మండలం అంకినాపురంతండాకు చెందిన ఓ రైతు పొలానికి వెళ్లగా అక్కడ పాదముద్రలు ఉండడం, చెట్టు ఎక్కిన ఆనవాళ్లు ఉండడంతో చిరుత పులిగా భావించి అటవీశాఖ ఉద్యోగులకు సమాచారం ఇచ్చాడు. దీంతో బీట్‌ ఆఫీసర్‌ బి.బాలాజీ, సిబ్బంది స్థానికులతో కలిసి పాదముద్రలను పరిశీలించారు. పూర్తిస్థాయిలో పరిశీలన అనంతరం ఆ పాదముద్రలు చిరుతవి కాదని, నక్క తిరిగినట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ మేరకు రైతులు, ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.

నక్కగా తేల్చిన అటవీ అధికారులు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement