బెంగళూరులో ఆర్టీసీ బస్సులకు మరిన్ని స్టాప్‌లు | - | Sakshi
Sakshi News home page

బెంగళూరులో ఆర్టీసీ బస్సులకు మరిన్ని స్టాప్‌లు

Jul 2 2026 2:23 AM | Updated on Jul 2 2026 2:23 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం నుండి బెంగళూరుకు నడిచే బస్సులకు అదనంగా స్టాప్‌లు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ ఏ.సరిరామ్‌ తెలిపారు. ఈమేరకు బెంగళూరులోని దేవనహళ్లి బైపాస్‌, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ ప్లాజా, ఎలహంక, ఎస్టీమ్‌ మాల్‌, హెబ్బల్‌, సీబీఐ జంక్షన్‌, ప్యాలెస్‌ గుట్ట హల్లి, ఆనందరావు జంక్షన్‌, కెంపెగౌడ బస్‌స్టేషన్‌(మెజెస్టిక్‌), యశ్వంతపూర్‌ మెట్రో స్టేషన్‌, పీనియా స్టాప్‌ల్లో కూడా ఇకపై బస్సులు ఆగుతాయని వెల్లడించారు. ప్రయాణికులు ఆయా ప్రాంతాల్లో బస్సు ఎక్కడంతో పాటు దిగే అవకాశం ఉందని ఆర్‌ఎం ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement