● పోలీసు కమిషనర్ సునీల్‌దత్
ఖమ్మంక్రైం: ప్రతీఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో భాగస్వాములు కావాలని సీపీ సునీల్‌దత్ సూచించారు. ఖమ్మం అంబేద్కర్ మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి బుధవారం ఆయన మొక్కలు నాటి మాట్లాడా రు. ఇళ్లలోనే కాక పరిసరాల్లో మొక్కలు నాట డం, సంరక్షించడాన్ని బాధ్యతగా తీసుకోవాల ని తెలిపారు. ఇందుకోసం కార్యాలయాలు, ఖాళీ స్థలాలు, రోడ్లకిరువైపులా సామూహిక డ్రైవ్ చేపట్టనున్నట్లు సీపీ వెల్లడించారు. ఏసీపీ రమణమూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ కనకవల్లి, సీఐలు కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాష్ పాల్గొన్నారు.
జిల్లా రిజిస్ట్రార్‌గా శ్రీనివాస్
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా నూతన రిజిస్ట్రార్(డీఆర్)గా ఏ.శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. చేవెళ్ల సబ్ రిజి స్ట్రార్(గ్రేడ్–1)గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు ప్రభుత్వం జిల్లా రిజిస్ట్రార్‌గా పదోన్నతి కల్పించి ఖమ్మంకు కేటాయించింది. అంతేకాక వరంగల్ జిల్లా రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతల(మార్కెట్ విలువలు అండ్ ఆడిట్)లను కూడా ఆయనకు అప్పగించగా విధుల్లో చేరారు. ఇక ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్‌గా ఉన్న ఎం.రవీందర్‌రావు రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా బదిలీ అయ్యారు. ఈమేరకు కొత్త రిజిస్ట్రార్ శ్రీనివాస్, బదిలీ రిజిస్ట్రార్ రవీందర్‌రావు ను కార్యాలయ ఉద్యోగులు సన్మానించారు.
ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు
ఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో సర్వర్ సమస్యతో నాలుగు రోజులుగా రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. కొత్త సాఫ్ట్‌వేర్ అమలు నేపథ్యాన ఈ పరిస్థితి నెలకొనగా, బుధవారం సర్వర్ అందుబాటులోకి రావడంతో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం 50డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే, వివాహ రిజిస్ట్రేషన్ల సమస్య కొనసాగినట్లు తెలిసింది.
రైళ్ల రాకపోకలకు
అంతరాయం
ఖమ్మం రాపర్తినగర్: పాపటపల్లి – డోర్నకల్ స్టేషన్ల మధ్య విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, లైన్ల మరమ్మతు పనుల కారణంగా బుధవారం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈమేరకు ఖమ్మం నుంచి వరంగల్, విజయవాడ వెళ్లే పలు రైళ్లు నిలిచిపోయాయి. ఖమ్మం స్టేషన్‌లో శాతవాహన, గోల్కొండ, కోణార్క్ తదితర రైళ్లను కాసేపు నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం రైళ్లను ఒక్కటొక్కటిగా నడిపించామని అధికారులు వెల్లడించారు.
పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు చేరిన యూరియా
చింతకాని: మూడు జిల్లాల అవసరాలకు గాను చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు బుధవారం 2,579 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 579 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 500 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు డీఏఓ ధనసరి పుల్లయ్య తెలిపారు. అలాగే, మహబూ బాబాద్ జిల్లాకు 1,400 మెట్రిక్ టన్నులు సరఫరా చేయగా, మరో 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.


