ముదిగొండ: గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వసతులు కల్పిస్తూ సమగ్రాభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముదిగొండ మండలం బాణా పురం, వల్లభి గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. బాణాపురంలో రూ.1.30 కోట్లతో నిర్మించే రహదారులు, కల్వర్టు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం మాట్లాడారు. ప్రతీ గ్రామానికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించడమే కాక అంతర్గత రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈక్రమంలో గ్రామవీధుల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం, స్థానికులతో మాట్లాడి పథకాల అమలు, సమస్యలపై ఆరా తీశారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టికి వల్లభి, బాణాపురం గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బాణాపురంలో గజమాలతో సన్మానించారు.
ఇందిరమ్మ గృహప్రవేశం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన పర్యటనలో భాగంగా బాణాపురం ఎస్సీ కాలనీలో మేడి నీరజ – సుధాకర్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈకార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థలు, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బాణాపురం సర్పంచ్ తేజావత్ సంధ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క


