నేటి నుంచి ‘ఉల్లాస్‌’ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘ఉల్లాస్‌’

Jul 2 2026 2:23 AM | Updated on Jul 2 2026 2:23 AM

మహిళా సంఘాల సభ్యులకు

చదవడం, రాయడంలో శిక్షణ

ఖమ్మంమయూరిసెంటర్‌: పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఉల్లాస్‌(నవ భారత అక్షరాస్యత కార్యక్రమం) గురువారం మొదలుకానుంది. మహిళల్లో విద్యపై అవగాహన కల్పించి వారికి చదవడం, రాయడం నేర్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈమేరకు ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 3వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు చదవడం, రాయడంతో పాటు ప్రాథమిక అక్షరాస్యత, సాధారణ సంఖ్యా జ్ఞానం(అంకెలు)పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా సంతకాలు చేయడం, బ్యాంకు లావాదేవీలు చూసుకోవడం అలవడనుంది. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ, మెప్మా అధికారులు వలంటీర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన పాఠ్యపుస్తకాలు, కిట్లను బుధవారం అందజేశారు. ఆర్పీలు, మెప్మా సిబ్బంది సమన్వయంతో నిర్వహించే శిక్షణను స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియో గం చేసుకోవాలని అధికారులు కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement