ఖమ్మంసహకారనగర్: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో భాగంగా ఓటర్లకు ఇంటింట ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కొనసాగుతోంది. ఈ నేపథ్యాన ఓటర్ల సందేహాలు నివృత్తి చేసేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ వద్ద హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఎన్యూమరేషన్ ఫారాలు భర్తీ చేసే అంశంపై ఓటర్లకు సలహాలు ఇస్తున్నట్లు సిబ్బంది తెలిపారు.
ఆస్తివివాదంతో
సామగ్రి ధ్వంసం
రఘునాథపాలెం: ఆస్తివివాదం నేపథ్యాన ఓ ఇంట్లోని సీసీ కెమెరాలు, విద్యుత్, ఇతర సామగ్రి ధ్వంసం చేసిన ఇద్దరిపై రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని వి.వెంకటాయ పాలెం గ్రామానికి చెందిన కుతుంబాక రవికుమార్‌కు ఏడెకరాల భూమి ఉంది. ఆ భూమిలో నిర్మించిన గదిలో పరిటాల గంగరాజు వాచ్‌మన్‌గా ఉంటున్నా డు. ఇటీవల రవికుమార్ బంధువైన సత్యనారాయణ, సతీశ్ వచ్చి భూమి తమదేనని గంగరాజును దుర్భాషలాడి వెళ్లగొట్టారు. అంతేకాక అక్కడ సీసీ కెమెరాలు, మోటారు మీటరు తదితర సామగ్రిని ధ్వంసం చేశారని అందిన ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.


