మధిర: మధిరకు చెందిన రిటైర్డ్ హిందీ పండిట్ రామిశెట్టి రోశయ్య శత వసంత జన్మదినోత్సవం బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని రోశయ్య ను సన్మానించి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పడమే కాక బడుగు, బలహీన వర్గాల ప్రజలు, శ్రమజీవుల సమస్యలపై రచనలు చేశారని కొనియాడారు. ఆయన జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో రోశయ్య కుటుంబీకులు దేవరపల్లి సుబ్రహ్మణ్యం, సమత, చైతన్య, డాక్టర్ వంశీకృష్ణ, మానస, రత్నకుమారి, మాధవి తదితరులు పాల్గొన్నారు.


