అంతర్జాతీయ పార్లమెంటరీ గ్రూప్‌లో ఎంపీ రఘురాంరెడ్డి | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ పార్లమెంటరీ గ్రూప్‌లో ఎంపీ రఘురాంరెడ్డి

Mar 15 2026 1:23 AM | Updated on Mar 15 2026 1:23 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మంం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డికి అంతర్జాతీయ పార్లమెంటరీ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్‌–స్విట్జర్లాండ్‌ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్‌ గ్రూప్‌ సభ్యుడిగా ఆయనను లోక్‌సభ స్పీకర్‌ నామినేట్‌ చేశారు. ప్రస్తుత 18వ లోక్‌సభ కాలానికి సంబంధించి భారత్‌, స్విట్జర్లాండ్‌ దేశాల మధ్య పార్లమెంటరీ స్నేహ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. ఇందులో రఘురాంరెడ్డికి స్థానం కల్పించినట్లు సమాచారం అందింది. ఈ గ్రూప్‌ ద్వారా రెండు దేశాల పార్లమెంటరీ సభ్యుల మధ్య పరస్పర సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఎంపీ కీలక గ్రూప్‌లో స్థానం దక్కడంపై ఉమ్మడి జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

వేగంగా డిజిటల్‌ పంటల సర్వే

బోనకల్‌: పంటల వివరాలు నమోదు చేసేందుకు డిజిటల్‌ సర్వేలో వేగం పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. బోనకల్‌ మండలం లక్ష్మీపురంలో వలంటీర్లు చేపడుతున్న సర్వే ను శనివారం ఆయన పరిశీలించి సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో వివరాలు పరిశీలిస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను ఏఈఓలు పర్యవేక్షించాలని తెలిపా రు. అనంతరం మొక్కజొన్నలో యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ వినయ్‌కుమార్‌, ఏఈ ఓ షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement