ఖమ్మం సహకారనగర్: జిల్లా ప్రజలు కులమతాలకతీతంగా జీవిస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారని వక్తలు పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవోస్) ఆధ్వర్యాన శనివారం నగరంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రంజాన్ అనేది ఉపవాసం ఉండే నెల మాత్రమే కాదని, ఆత్మశుద్ధి చేసుకునే నెల అన్నారు. టీజీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి, నాయకులు మల్లెల రవీంద్రప్రసాద్, గంగవరపు నరేందర్, సూరంపల్లి రాంబాబు, శేషుప్రసాద్, కస్తాల సత్యనారాయణ, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాస్, కొణిదన శ్రీనివాసరావుతో పాటు దుర్గాప్రసాద్, తాళ్లూరి శ్రీకాంత్, కోనార్‌తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
టీజీవోస్ ఇఫ్తార్ విందులో వక్తలు


