నేడు మంత్రి తుమ్మల పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి తుమ్మల పర్యటన

Mar 15 2026 1:23 AM | Updated on Mar 15 2026 1:23 AM

ఖమ్మంఅర్బన్‌: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్‌ ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆతర్వాత భద్రాద్రి జిల్లా పాల్వంచ శ్రీనివాస కాలనీలో జరిగే శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొంటారు.

శ్రీవారికి ప్రత్యేక పూజలు

ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్‌తో పాటు ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను అలంకరించి నిత్యకల్యాణం, పల్లకీసేవ చేశారు. జనగామ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ వెంకటరమణతో పాటు భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement