డిప్యూటీ సీఎం, మంత్రులకు ఆహ్వానం
భద్రాచలం: భద్రాచలంలో ఈనెల 27, 28వ తేదీల్లో జరిగే సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం వేడుకలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులకు ఆలయ అధికారులు శనివారం హైదరాబాద్‌లో ఆహ్వాన పత్రికలు అందజేవారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పశుసంవర్థక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వారి నివాసాల్లో కలిశారు. అర్చకులు మంత్రోచ్చరణలతో ఆశ్వీరదించగా, ఈఓ ప్రసాదాలు, ఆహ్వాన పత్రికలను అందించారు. ఆలయ ఈఓ దామోదర్, ఆలయ ఉప ప్రధానార్చకుడు శ్రీనివాస రామానుజం, రామాయణం పారాయణుడు అంతర్వేది కృష్ణమాచార్య, ఏఈఓ భవానీ రామకృష్ణ తదితరులు ఉన్నారు.


