అటవీ సరిహద్దులపై వర్క్‌షాప్
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలోని అటవీ భూముల సరిహద్దుల గుర్తింపుపై అటవీ శాఖ దృష్టి సారించింది. నానాటికి అటవీ భూముల ఆక్రమణలు పెరుగుతుండటంతో సరిహద్దుల గుర్తింపు, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యోగులకు అవగాహన కల్పి స్తున్నారు. రిజర్వ్ ఫారెస్టు భూములు ఆక్రమణతో అడవులు అంతరించిపోవడమే కాక వన్యప్రాణుల మనుగడకు ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఖమ్మంలోని అటవీశాఖ కార్యాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీసీఎఫ్) బీమానాయక్ అటవీ భూముల సరిహద్దుల గుర్తింపు, రెవెన్యూ ఉద్యోగులతో సమన్వయం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం, కూసుమంచి, తల్లాడ, మధిర, కారేపల్లి, సత్తుపల్లి రేంజ్‌ల్లో 1.50 లక్షల రిజర్వ్ ఫారెస్టు, భూములు నోటిఫై అయినందున సర్వే నంబర్ల ఆధారంగా గర్తించాలని సూచించారు. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ భూముల సరిహద్దులను గుర్తించడమే కాక రక్షణకు తీసుకోవా ల్సిన చర్యలను వివరించారు. ఎఫ్‌డీఓ మంజుల, ఉద్యోగులు, డ్రాఫ్ట్‌మెన్లు, ఆపరేటర్లు పాల్గొన్నారు.
అవగాహన కల్పించిన సీసీఎఫ్ బీమానాయక్


