ఎన్నికల వైపు
న్యూస్‌రీల్
ఈనెల 23న ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రకటన ఈనెలాఖరులోగా గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అంతా సిద్ధం చేస్తున్న యంత్రాంగం
వడివడిగా..
శుక్రవారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 2025
మళ్లీ మొదటికి..
స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు అభ్యంతరాల నేపథ్యాన ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభం కానుంది. దీంతో రిజర్వేషన్లు, ఓటరు జాబితా సవరణ, పోలింగ్‌కేంద్రాల గుర్తింపును అధికార యంత్రాంగం మరోసారి చేపట్టనుంది. ఇప్పటికే ఓటరు జాబితా సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో ప్రారంభించారు. అలాగే, బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామగ్రిని సరి చూసుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్‌స్టేషన్ల గుర్తింపు, ఎన్నికల సామగ్రి, జోనల్ ఆఫీసర్లు, అబ్జర్వర్ల నియామకంపై సూచనలు చేశారు.
మరోసారి రిజర్వేషన్లు
గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అధికారులు గతంలో బీసీలకు 42 శాతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న హైకోర్టు తీర్పుతో మళ్లీ లెక్కించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో 50 శాతానికి లోబడి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇచ్చాక జిల్లాలో ప్రక్రియ చేడుతారు. పంచాయతీల్లో జనాభా ఆధారంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యాన జెడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీఓలు రిజర్వేషన్లు సిద్ధం చేస్తారు.
23న ఓటర్ల తుదిజాబితా
గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 2న విడుదల చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా జిల్లాలో 8,02,691మంది ఓటర్లు ఉండగా.. 5,214 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ జాబితాపై శుక్రవారం వరకు అభ్యంతరాలు స్వీకరించి.. వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను ఈనెల 22న డీపీఓలు పరిష్కరిస్తారు. ఆపై 23వ తేదీన ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్ల వివరాలను వెల్లడిస్తారు. ఆతర్వాత రిజర్వేషన్ల ఖరారైతే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని సమాచారం. ఏదిఏమైనా ఈనెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది.
గ్రామాల్లో సందడి
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉంటాయోన్న సందిగ్ధత రాజకీయ నాయకులతో పాటు గ్రామస్తుల్లో నెలకొంది. అక్టోబర్, నవంబర్‌ల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు చేసినా రిజర్వేషన్ల కారణంగా జరగలేదు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయోనని అనుమానాలు వ్యక్తమవుతుండగానే ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈసారి పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్లాలని నిర్ణయించడంతో అడ్డంకులు ఉండవనే భావిస్తున్నారు. దీంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఆశావహులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదేసమయాన రిజర్వేషన్లు ఎలా ఉంటాయి, ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చ ప్రారంభమైంది. దీనికితోడు మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాల్లో పలువురు నిమగ్నం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి గురువారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా హైదరాబాద్ నుండి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కలెక్టరేట్ నుంచి పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రాణి కుముదిని మూడో విడతల్లో జీపీ ఎన్నికలు జరిగితే ఏ విడతలో ఎక్కడ నిర్వహించాలో ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అలాగే, ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల ఖరారులో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. షెడ్యూల్ విడుదలయ్యాక అందే ప్రతీ ఫిర్యాదుపై స్పందించాలని తెలిపారు. వీసీ అనంతరం అదనపు కలెక్టర్ శ్రీజ అధికారులతో సమావేశమై రిజర్వేషన్ ప్రక్రియ, ఏర్పాట్లపై సూచనలు చేశారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, డీఎల్‌పీఓలు విజయలక్ష్మి, రాంబాబు పాల్గొన్నారు.
జీపీ ఎన్నికలకు మరోసారి ఏర్పాట్లు
ఎన్నికల వైపు
ఎన్నికల వైపు
ఎన్నికల వైపు
ఎన్నికల వైపు


