రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
వైరా: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క శని వారం వైరాలో పర్యటించనున్నారు. ఆయన శనివారం ఉదయం 10.45గంటలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం వైరాలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత జరిగే సభలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతారని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్ వెల్లడించారు.
విత్తన చట్టంపై
అవగాహన తప్పనిసరి
వైరా: రైతులు విత్తన చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ‘విత్తన చట్టం–2025’పై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టంపై అవగాహన ఉండడం ద్వారా నష్టాలు ఎదురుకావని తెలిపారు. ఆతర్వాత చట్టంలోని ముఖ్యాంశాలను మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం మధిర ప్రధాన శాస్తవేత్త డాక్టర్ రుక్మిణీదేవి వివరించారు. కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ సుచరితాదేవి, వైరా ఏడీఏ టి.కరుణశ్రీ, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ చైతన్య, డాక్టర్ ఫణిశ్రీ, ఏఓలు, ఏఈఓలు ల్గొన్నారు.
అందుబాటులోకి
టీఎంటీ సేవలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రిలో ట్రెడ్‌మిల్ టెస్ట్(టీఎంటీ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్, మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ గురువారం కార్డియాలజీ విభాగంలో ఈ సేవలను ప్రారంభించి మాట్లాడారు. బయటపడని గుండె సంబంధిత సమస్యలను టీఎంటీ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పరీక్ష ద్వారా గుండె ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులను గుర్తించవచ్చని చెప్పారు. ఐడీబీఐ బ్యాంక్ సహకారంతో ఈ మిషన్ ఏర్పాటైందని తెలిపారు. ఆర్‌ఎంఓలు డాక్టర్ కళావతిబాయి, డాక్టర్ రాంబాబు, గుండె వైద్య నిపుణులు డాక్టర్ సీతారామ్, డాక్టర్ ఎల్.కిరణ్‌కుమార్, ఉద్యోగులు శాంతకుమారి, పద్మ, రత్నకుమార్, మేరి, రాజమ్మ, వసుమతి, ధనమ్మ, సుధాకర్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కండి
తిరుమలాయపాలెం: విద్యార్థులు పాఠశాలతో పాటు ఇంటి ఆవరణలో మొక్కలు నాటడమే కాక తడి, పొడి ఎత్త వేరు చేయడంపై అవగాహ న పెంచుకునిపర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ సూచించారు. మండలంలోని సుబ్లేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యాన నిర్మించిన ఇంకు డు గుంతలు, ఔషధ మొక్కల గార్డెన్, తడి, చెత్త పొడి చెత్త వేరు చేసే యూనిట్లను గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్లాస్టిక్ నిర్మూలన విద్యార్థి దశ నుంచే మొదలైతే మంచి ఫలి తాలు వస్తాయన్నారు. ఈ విషయంలో విద్యార్థులు ప్రతిజ్ఞ చేయగా 120 మందికి సొంత నగదుతో స్టీల్ వాటర్ బాటిళ్లు కొనిస్తానని తెలిపారు. అలాగే, విద్యార్థులందరికీ గుడ్డ సంచులు అందించాలని హెచ్‌ఎంకు సూచించారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్‌రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్‌ఎం గోపాల్‌రావు, ఉపాధ్యాయులు పాపారావు, కోటేశ్వరరావు, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి, యంగ్ ఎర్త్ లీడర్స్ నిర్వాహకులు యానాల వెంకటరెడ్డి పాల్గొన్నారు.


