డైట్‌లో అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం సహకారనగర్: డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల కోసం రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ నాంపల్లి రాజేష్ తెలిపారు. సైన్స్, విజువల్ ఆర్ట్స్ అండ్ పర్ఫామింగ్ ఆర్ట్స్ పోస్టులు ఒక్కొక్కటి ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. గెస్ట్ ఫ్యాకల్టీగా గౌరవ వేతనం అందుతుందని, ఆసక్తి ఉన్న వారు ఈనెల 22నుంచి 29వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు 94900 02259 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
డైట్‌లో అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


