ఆర్‌అండ్‌బీ రహదారులపై ప్యాచ్‌వర్క్
ఖమ్మంఅర్బన్: జిల్లాలోని ఆర్‌అండ్‌బీ రహదారులు గత ఏడాది వర్షాలకు దెబ్బతినగా మరమ్మతులు లేకపోవడంతో ఇటీవల వరదలకు మరింత ధ్వంసమయ్యాయి. దీంతో గుంతల మీదుగా రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈమేరకు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్యాచ్‌వర్క్ పనులు ప్రారంభించారు. జిల్లాలోని ప్రతీ మండలంలో రూ.20 లక్షల విలువైన పనులు చేపట్టనుండగా రూ.4కోట్లతో పనులు చేయిస్తున్నారు. భారీ గుంతల్లో కంకర పోసి రోలింగ్ చేశాక తారు వేయిస్తున్నారు. ఖమ్మం – ఇల్లెందు, ఖమ్మం – వైరా, పల్లిపాడు – ఏన్కూరు, తల్లాడ – భద్రాచలం, ఏన్కూరు – తిమ్మారావుపేట రహదారులపై పనులు చకచకా సాగుతుండడంతో వాహనదారులకు ఊరట లభించనుంది. అయితే, పనులు వేగంగా చేపట్టడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో లింక్ రోడ్లను కమ్మేసిన కంపచెట్లను తొలగించాలని పలువురు కోరుతున్నారు.
గుంతల నుంచి వాహనదారులకు ఊరట


