పెద్దాస్పత్రిలో క్యాంటీన్ల వివాదం
ఇప్పటికే రూ.2లక్షల అద్దెతో
ఒకటి నిర్వహణ
ప్రస్తుతం వైద్యుల కోసమంటూ
ఇంకొకటి ఏర్పాటు
ఆస్పత్రిలోని హాల్ కూడా కేటాయింపు
గత కలెక్టర్ హయాంలో...
కలెక్టర్‌గా ముజమ్మిల్‌ఖాన్ ఉన్నప్పుడు ఆస్పత్రిలోని క్యాంటీన్ నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించారు. దీంతో పది మంది సభ్యులు నిర్వహిస్తూ నెలనెలా ఆస్పత్రికి రూ.2 లక్షలు చెల్లించేలా నిబంధన విధించారు. చికిత్స పొందుతున్న వారితో పాటు సహాయకులు ఆస్పత్రి సిబ్బంది ఇన్నాళ్లు ఈ క్యాంటీన్‌నే ఆశ్రయిస్తున్నారు.
‘ప్రత్యేకం’గా కావాలని...
పెద్దాస్పత్రిలోని మొదటి క్యాంటీన్‌ను రోగులు, సహాయకులు, సిబ్బంది వినియోగించుకుంటున్నా ఆస్పత్రి వైద్యులు, ఉద్యోగులు మాత్రం అక్కడకు వెళ్లడం లేదు. టీ, ఇతరత్రా కావాలంటే తాము ఉన్న చోటుకే తెప్పించుకుంటారు. ఈక్రమంలోనే తమకు ప్రత్యేక క్యాంటీన్ కావాలని అప్పటి కలెక్టర్‌కు విన్నవించగా అనుమతి ఇచ్చారు. కానీ అధికారులు మాత్రం కార్డియాలజీ విభాగం పక్కనే కొత్త క్యాంటీన్ ఏర్పాటు చేయడంతో రోగులు, వారి సహాయకులు, పారామెడికల్ సిబ్బంది, వైద్యులతో కళకళలాడుతోంది. తొలుత రెండోది అనుమతించబోమని చెబితే నెలనెలా రూ.2లక్షలు చెల్లించేందుకు అంగీకరించామని, ఇప్పుడు రెండో క్యాంటీన్ ఏర్పాటుతో తమ గిరాకీ పడిపోయిందని మొదటి క్యాంటీన్ నిర్వాహకులు వాపోతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
ఆస్పత్రి ఆవరణలోని ఖాళీ స్థలంలో ఏర్పాటుచేయాల్సి ఉండగా రెండో క్యాంటీన్ కోసం కార్డియాలజీ విభాగానికి ఆనుకుని షెడ్లు వేశారు. ఇదిపోగా కార్డియాలజీ విభాగంలో ఒక పెద్ద హాల్‌ను సైతం కేటాయించగా బేబుళ్లు, కుర్చీలు వేసి నిర్వహిస్తున్నారు. అసలే ఆస్పత్రిలో గదుల కొరత ఉన్న నేపథ్యాన హాల్ కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్‌ను వివరణ కోరగా గత ఏడాది వైద్యుల వినతితో అప్పటి కలెక్టర్ క్యాంటీన్‌కు అనుమతి ఇచ్చారని తెలిపారు. భవిష్యత్‌లో ఇబ్బంది ఏర్పడితే తరలిస్తామని చెప్పారు. ఇక మొదటి క్యాంటీన్ నిర్వాహకులకు సమస్య వస్తే పరిశీలిస్తామని తెలిపారు.
జిల్లా జనరల్ ఆస్పత్రిలో క్యాంటీన్ల వివాదం నెలకొంది. ఇప్పటికే ఒకటి కొనసాగుతుండగా.. వైద్యులు, సిబ్బంది కోసమంటూ రెండోది ఏర్పాటుకు
అనుమతించారు. దీంతో అమ్మకాలు పడిపోయాయని మొదటి క్యాంటీన్ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు.
– ఖమ్మంవైద్యవిభాగం
పెద్దాస్పత్రిలో క్యాంటీన్ల వివాదం


