జిల్లాలో ఒక్కరే కోచ్‌.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఒక్కరే కోచ్‌..

Aug 29 2025 6:23 AM | Updated on Aug 29 2025 6:23 AM

జిల్ల

జిల్లాలో ఒక్కరే కోచ్‌..

● మిగతా క్రీడాంశాలకు సీనియర్‌ క్రీడాకారులే దిక్కు ● ఫలితంగా ఔత్సాహికులకు అందని శిక్షణ

ముందు కోచ్‌లను నియమించాలి

అన్ని చోట్ల నియమిస్తాం...

● మిగతా క్రీడాంశాలకు సీనియర్‌ క్రీడాకారులే దిక్కు ● ఫలితంగా ఔత్సాహికులకు అందని శిక్షణ
నేడు జాతీయ క్రీడా దినోత్సవం

ఖమ్మం స్పోర్ట్స్‌: స్పోర్ట్స్‌ అథారిటీ తీరుతో ఔత్సాహిక క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు వైరా, మధిర, సత్తుపల్లిలో స్టేడియాలు ఉన్నా శిక్షకుల నియామకంపై ముందడుగు పడడం లేదు. జిల్లాలో కొన్నాళ్ల క్రితం వరకు ఇద్దరు శాట్స్‌ కోచ్‌లు ఉండగా.. ప్రస్తు తం ఒకరే కొనసాగుతున్నారు. అదీ జిల్లా కేంద్రంలో అథ్లెటిక్స్‌ అకాడమీలో ఉండగా.. మిగిలిన అన్ని క్రీడాంశాలకు సీనియర్‌ క్రీడాకారులే శిక్షణ ఇవ్వాల్సి వస్తోంది. నియోజకవర్గ కేంద్రాలతో పాటు గ్రామపంచాయతీల్లోనూ పల్లె క్రీడాప్రాంగణాలను ఏర్పాటుచేసినా కోచ్‌ల నియామకం లేక సీనియర్‌ క్రీడాకారులు, పీఈటీలే శిక్షణ ఇస్తుండడం గమనార్హం.

క్రీడా మౌలిక వసతులే మార్గం..

ఇటీవల హైదరాబాద్‌లో నూతన క్రీడా పాలసీపై నిర్వహించిన సదస్సులో జిల్లా క్రీడా సంఘాలు, స్పోర్ట్స్‌ అథారటీ బాధ్యులు పాల్గొన్నారు. గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులను వెలికితీసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని, ఇందుకు కావాల్సిన నిధులను మంజూరు చేయాలన్న అంశాన్ని ఎవరూ ప్రస్తావించలేదని తెలిసింది. గ్రామాల్లో క్రీడా మౌలిక వసతులు కల్పించే దిశగా ఆలోచన చేస్తేనే క్రీడారంగంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ విషయంలో ప్రభుత్వం, శాట్స్‌ పట్టింపు లేని తనం క్రీడాకారులకు శాపంగా మారుతోంది.

నియామకంతోనే ఫలితం

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌(ఎన్‌ఐఎస్‌)లో రెండేళ్ల కాలం శిక్షణ పూర్తి చేసిన వారిని కోచ్‌లుగా నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భారత క్రీడా ప్రాధికార సంస్థ(శాయ్‌) సీనియర్‌ క్రీడాకారుల సౌకర్యార్థం ఆరు వారాల కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రీడల్లో నిష్ణాతులైన వారు ఈ కోర్సు చేస్తే క్రీడాకారులకు మంచి శిక్షణ ఇవ్వగలరనే నమ్మకంతో ఏర్పాటు చేశారు. కానీ రెండేళ్ల కోర్సు చేస్తేనే కోచ్‌గా పరిగణనలోకి తీసుకుంటూ, సర్టిఫికేట్‌ కోర్సు చేసిన వారిని అంతగా పట్టించుకోవడం లేదని సమాచారం. ప్రస్తుతం శిక్షకులుగా పని చేస్తున్న వారిలో సీనియర్‌ క్రీడాకారులు తక్కువ మంది ఉండగా.. క్రీడలపై అవగాహనతోనే కోచ్‌లుగా కొనసాగుతున్నారనే ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి.

రాష్ట్రంలో ముందుగా కోచ్‌లు, పీఈటీల భర్తీ చేసి అప్పుడు క్రీడల అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుటుంది. రాష్ట్రంలో కోచ్‌ల కొరత తీవ్రంగా ఉంది. కోచ్‌ల భర్తీ విషయంలో తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ తక్షణం చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు కోచ్‌లు, పీఈటీలను నియమించాలి. – పుట్టా శంకరయ్య,

ఒలింపిక్‌ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు

సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ప్రతి క్రీడాంశంలో శిక్షకులు ఉన్నారు. ఆయా క్రీడాంశాల్లో ప్రతి ఏటా జరిగే రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. జిల్లాలో కల్లూరు, మధిర, వైరాల్లో స్టేడియాలు అందుబాటులో ఉన్నాయి. ఆక్కడ కూడా శిక్షకులను నియమించేందుకు చర్యలు తీసుకున్నాం.

– టి.సునీల్‌రెడ్డి, డీవైఎస్‌ఓ

జిల్లాలో ఒక్కరే కోచ్‌..1
1/2

జిల్లాలో ఒక్కరే కోచ్‌..

జిల్లాలో ఒక్కరే కోచ్‌..2
2/2

జిల్లాలో ఒక్కరే కోచ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement