
విలువ తెలియదా..?!
సత్తుపల్లిటౌన్: విలువైన వాహనాలు.. అంతే స్థాయిలో కలపను భద్రపర్చడంలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చెదలు పట్టి మట్టిలో కలిసిపోతున్నాయి. అక్రమంగా కలప రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేయగా సత్తుపల్లి టింబర్ డిపోలో పార్క్ చేశారు. ఇందులో డీసీఎంలు, లారీలు, ఆటోలు, కార్లు, జీప్‌లు, సైకిళ్లు, ద్విచక్రవాహనాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటిని నిర్ణీత కాల వ్యవధిలో వేలం వేస్తే అటవీ శాఖకు ఆదాయం సమకూరే అవకాశమున్నా పట్టించుకోకపోవడంతో తుప్పుపట్టి భూమిలో కూరుకుపోతున్నాయి. ఇక అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న టేకు, జిట్రేగి, నారేప తదితర రకాల విలువైన కలపను సైతం ఏళ్ల తరబడి నేలపై వదిలిలేయడంతో చెదలు పట్టి మట్టిలో కలిసిపోపోయే పరిస్థితి నెలకొంది. కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తూ వాహనాలు, కలపకు వేలం వేస్తే అటవీశాఖకు ఆదాయం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వాహనాలు, కలపకు తుప్పు, చెదలు

విలువ తెలియదా..?!