పాముకాటుతో బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో బాలిక మృతి

Aug 29 2025 6:23 AM | Updated on Aug 29 2025 6:23 AM

పాముక

పాముకాటుతో బాలిక మృతి

ఖమ్మంలీగల్‌: బీమా పథకం తీసుకున్న వ్యక్తికి వైద్య ఖర్చుల నిమిత్తం పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ చైర్మన్‌ వి.లలిత, సభ్యురాలు ఏ.మాధవీలత గురువారం తీర్పునిచ్చారు. కల్లూరు మండలం చంద్రుపట్లకు చెందిన కాటమనేని రాజేశ్వరరావు ఆంధ్రా బ్యాంకు, మణిపాల్‌ సిగ్నహెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా కుటుంబంతో కలిపి 2024 ఫిబ్రవరిలో రూ.4లక్షల పరిమితితో పాలసీ తీసుకున్నాడు. ఆయన కొన్నాళ్లకు అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకున్నాక ఖర్చులు చెల్లించాలని ఇన్సూరెన్స్‌ కంపెనీని కోరితే నిరాకరించారు. దీంతో న్యాయవాదుల ద్వారా కమిషన్‌ను ఆశ్రయించగా వైద్య ఖర్చులు రూ.2,27,284ను 7శాతం వడ్డీతో, వేదనకు గురి చేసినందుకు రూ.10వేలు, ఖర్చుల నిమిత్తం మరో రూ.10వేలు 45 రోజుల్లోపు చెల్లించాలని కమిషన్‌ తీర్పునిచ్చింది.

తల్లి పరిస్థితి విషమం

సత్తుపల్లిరూరల్‌: ఇంట్లో నేలపై నిద్రిస్తున్న తల్లీకుమార్తెను కట్లపాము కాటు వేయడంతో కూతురు గౌర లోహిత(5) మృతి చెందగా.. ఆమె తల్లి మౌనికను మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సత్తుపల్లి మండలం చిన్నపాకలగూడెంలో బుధవారం అర్ధరాత్రి 2గంటల సమయాన ఈ సంఘటన చోటు చేసుకుంది. పాము కాటు వేయగానే బాలిక, ఆమె తల్లి కేకలు వేస్తుండడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి పామును చంపేశారు. ఆపై 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే లోహిత మృతి చెందింది. దీంతో ఆమె తల్లి మౌనికను ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి...

సత్తుపల్లి: విద్యుదాఘాతానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఖమ్మంకు చెందిన లారీ డ్రైవర్‌ షేక్‌ అక్తర్‌పాషా(49) గురువారం మృతి చెందారు. సత్తుపల్లి మండలం తాళ్లమడలోని రైస్‌మిల్లు వద్ద ఈనెల 15న ఆగి ఉన్న లారీలో ఆయన కూర్చోగా లారీ కి విద్యుత్‌ వైర్లు తాకడంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో సత్తుపల్లి, ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరా బాద్‌ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతోనే అక్తర్‌ మృతి చెందాడని ఆయన మేనమామ షేక్‌ ఘనీ సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఐదుగురికి గాయాలు

ఖమ్మంరూరల్‌: ఆగి ఉన్న కంటైనర్‌ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా ఐదుగురికి గాయాలయ్యాయి. వివరాలిలా.. 50 మంది ప్రయాణికులతో ఖమ్మం నుంచి సూర్యాపేటకు వెళ్తున్న సూర్యాపేట డిపో బస్సు మండలంలోని మద్దులపల్లి వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, నలు గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీయించి ఆస్పత్రికి తరలించారు.

వైద్యఖర్చులు చెల్లించాలని తీర్పు

పాముకాటుతో బాలిక మృతి
1
1/1

పాముకాటుతో బాలిక మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement