
అమరుల పోరాట స్ఫూర్తితో ముందుకు..
ఖమ్మంమయూరిసెంటర్: బషీర్‌బాగ్ విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు వామపక్ష పార్టీల నాయకులు గురువారం నివాళులర్పించారు. 2000 సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రదర్శనలో పాల్గొన్న వారిపై బషీర్‌బాగ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందారు. ఈమేరకు సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ అధ్యక్షతన రామకృష్ణ స్తూపం వద్ద జరిగిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, మాస్‌లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సీ.వై.పుల్లయ్య మాట్లాడుతూ ఆనాడు చంద్రబాబునాయుడు తీరుపై ఉద్యమించగా.. అమరుల త్యాగాలతోనే రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు సబ్సిడీ ఇస్తున్నారని తెలిపారు. కాగా, సంస్కరణలు, ఆర్థిక విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా అమరుల సాక్షిగా పోరాడుతామని చెప్పారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, వివిధ పార్టీల నాయకులు జానీమియా, శింగు నర్సింహారావు, బండి రమేష్, జి.రామయ్య, ఆవుల అశోక్, ఝాన్సీ, మాదినేని రమేష్, శ్రీనివాసరావు, మనోహర్, ఎం.ఏ.జబ్బార్, ఎస్.కే.మీరా, దొంగల తిరుపతిరావు, ఎస్.నవీన్‌రెడ్డి, కార్పొరేటర్లు గోపి, బి.జి.కై ్లమెంట్ తదితరులు పాల్గొన్నారు.