
బాలికల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి
కొణిజర్ల: బాలికలను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్ది, వారి సర్వతోముఖాభివృద్ధికి అధ్యాపకులు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్(ఆర్‌సీఓ) అరుణకుమారి అన్నారు. మండలంలోని తనికెళ్ల తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఆదివారం డిగ్రీ ప్రథమ సంవత్సర బాలికలకు స్వాగత వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణకుమారి మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్‌లో పట్టు సాధించాలని సూచించారు. బాలికల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెడుతోందని, గురుకులాల్లో సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని బాగా చదవాలని, భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. అనంతరం బాలికల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ కె. రజని అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్య, వివిధ విభాగాల కోఆర్డినేటర్లు కె.పి. ఐశ్వర్య, ఎ.దీప్తి, ఎన్‌సీసీ కోఆర్డినేటర్ కె.రజిత తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా గురుకులాల
ఆర్‌సీఓ అరుణకుమారి