
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
ఖమ్మం సహకారనగర్: ఉమ్మడి జిల్లాలోని చెందిన 12 ఇంజనీరింగ్ కళాశాలలకు సుమారు రూ.24 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నందున తక్షణమే చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు కోరాయి. వివిధ కళాశాలల చైర్మన్లు గుండాల కృష్ణ, చలసాని సాంబశివరావు, శ్రీధర్, నవీన్, భరత్, కిరణ్, రాజేశ్వరరావు, మణి, దాసరి ప్రభాకర్‌రెడ్డి, అబ్దుల్ ఖలామ్ తదితరులు బుధవారం ఖమ్మంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం మంత్రులు, వామపక్ష పార్టీల కార్యదర్శులను కలవాలని నిర్ణయించామని చెప్పారు. బకాయిలు పేరుకుపోవడంతో యాజ మాన్యాలపైనే కాక విద్యార్థులతో ఒత్తిడి పెరుగుతున్నందున ప్రభుత్వం స్పందించాలని కోరారు.