ముగిసిన ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరం

Jun 8 2025 12:18 AM | Updated on Jun 8 2025 12:18 AM

ముగిస

ముగిసిన ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరం

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యాన రఘునాథపాలెం మండలం మల్లెమడుగులో నెల రోజులుగా నిర్వహిస్తున్న వేసవి ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో స్పోర్ట్స్‌ అథారిటీ కోచ్‌ ఎం.డీ.అక్బర్‌ అలీ పాల్గొని క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కె.ఆదర్శ్‌కుమార్‌, క్యాంప్‌ ఇన్‌చార్జి బి.కృష్ణయ్య పాల్గొన్నారు.

‘విద్యావ్యాపారులతో కుమ్మకై ్కన అధికారులు’

ఖమ్మంమయూరిసెంటర్‌: విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృధ్వీ, జిల్లా కార్యదర్శి వెంకటేష్‌ విమర్శించారు. ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన పీడీఎస్‌యూ జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. పలు ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు కనీస ప్రమాణాలు పాటించకుండా సంపాదనే లక్ష్యంగా వ్యాపారానికి పాల్పడుతున్నాయని విమర్శించారు. పేద వర్గాల వద్ద అధిక మొత్తంలో డొనేషన్ల పేరుతో ఫీజులు గుంజుతున్నారని పేర్కొన్నారు. అయితే, నిబంధనలు పాటించని ఏ ప్రైవేట్‌ విద్యాసంస్థపైనా అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. ఈసమావేశంలో నాయకులు తిప్పారపు లక్ష్మణ్‌, కిరణ్‌, పృధ్వీ, కార్తీక్‌, యశ్వంత్‌, సందీప్‌, చంద్రశేఖర్‌, వినయ్‌, సతీష్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌

నిర్మాణానికి రూ.2.70కోట్లు

తిరుమలాయపాలెం: మండలంలోని సుబ్లేడులో ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ నిర్మాణానికి రూ.2.70 కోట్లు మంజూరయ్యాయి. ఇక్కడ హాస్టల్‌ ఆవశ్యకతను గుర్తించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో నిధులు మంజూరు చేశారు. దీన్ని పాత హాస్టల్‌ స్థలంలో నిర్మించనుండగా, స్థలాన్ని శుభ్రం చేయించే పనులను శనివారం ఐడీసీ ఈఈ విన్సెంట్‌రావు, బీరోలు సొసైటీ చైర్మన్‌ రామసహాయం నరేష్‌రెడ్డి ప్రారంభించారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ సత్యనారాయణరెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ బత్తుల వెంకటనారాయణతో పాటు యలమంద, నవీన్‌, బోడ రమేష్‌ పాల్గొన్నారు.

ముగిసిన ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరం
1
1/2

ముగిసిన ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరం

ముగిసిన ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరం
2
2/2

ముగిసిన ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement