తహసీల్దార్లకు పోస్టింగ్‌లు
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలోని పలువురు తహసీల్దార్లకు ఇటీవల బదిలీలు జరగగా.. వారి స్థానంలో జిల్లాకు కేటాయించిన తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇస్తూ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఆయా స్థానాల్లో వెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చిన డి.సైదులును ఖమ్మం అర్బన్ తహసీల్దార్‌గా, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ వి.రవికుమార్‌ను కూసుమంచి మండలానికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చిన ఎం.రమాదేవిని బోనకల్ తహసీల్దార్‌గా, మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఎస్.శ్వేతను రఘునాథపాలెం మండలానికి, అక్కడి తహసీల్దార్ లూథర్ విల్సన్‌ను తిరుమలాయపాలెం మండలానికి బదిలీ చేశారు. ఎస్.వి.నారాయణమూర్తిని కల్లూరు ఆర్డీఓ కార్యాలయ డీఏఓగా నియమించారు.
హెచ్‌ఐవీ రహిత జిల్లాగా మార్చాలి
డీఎంహెచ్‌ఓ కళావతిబాయి
ఖమ్మంవైద్యవిభాగం : జిల్లాను హెచ్‌ఐవీ రహితంగా మార్చాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతిబాయి అన్నారు. అంతర్జాతీయ కొవ్వొత్తుల స్మారక దినం సందర్భంగా ఆదివారం రాత్రి స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కళావతిబాయి మాట్లాడుతూ.. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారి పట్ల ప్రేమ, అనురాగాలు చూపించాలని, వారిని కూడా సమాజంలో అందరిలాగే గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌టీ డాక్టర్లు లక్ష్మణరావు, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్
ఖమ్మం సహకారనగర్ : జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం ఏడు ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఖమ్మం, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఆరు కేంద్రాలు ఉండగా.. సత్తుపల్లిలో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 : 30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు కొనసాగగా.. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు.
రామయ్యకు
సువర్ణ పుష్పార్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కిన్నెరసానిలో జలవిహారం
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు కిన్నెరసాని ప్రాజెక్ట్‌కు తరలివచ్చారు. డ్యామ్‌పై నుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 560 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.30,820 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.13,300 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తహసీల్దార్లకు పోస్టింగ్‌లు
తహసీల్దార్లకు పోస్టింగ్‌లు


